ఆప్ కు మరో ఝలక్
మంత్రి పదవికి రాజ్ కుమార్ రాజీనామా అవినీతి పార్టీలో మనుగడ సాధించలేకే వీడుతున్నా
న్యూఢిల్లీ: అవినీతి కేసులో ఇరుక్కున్న ఆప్ మంత్రి కేజ్రీవాల్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బుధవారం ఆప్ పార్టీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు.
రాజ్‌కుమార్ ఆనంద్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2022 నవంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సేవలకు గాను పార్టీ మరిన్ని అదనపు బాధ్యతలు కూడా అప్పజెప్పింది. పార్టీకి రాజీనామా విషయంపై ఆనంద్ మాట్లాడుతూ.. ఆప్ పార్టీ అవినీతి ఉచ్చులో ఇరుక్కుపోయిందన్నారు. అవినీతి పార్టీలో తాను మనుగడ సాగించలేనని స్పష్టం చేశారు. దేశంలో మార్పు ఉద్దేశమే ధ్యేయంగా కేజ్రీవాల్ పార్టీలో చేరానని తెలిపారు. కానీ నేడు అవినీతిలో ఆప్ పార్టీ సీఎంయే కూరుకుపోవడం విచారకరమన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో 13 మంది ఎంపీలు ఉన్నా వారిలో దళితులు, మహిళలు, బీసీలు ఒక్కరూ లేరని, మంత్రులకు పార్టీలో ఎలాంటి గౌరవం లేదని ఆయన ఆరోపించారు.