లోక్ సభలో బీజేపీ విప్ గా  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  

Konda Vishweshwar Reddy as BJP Whip in Lok Sabha

Jul 30, 2024 - 11:51
 0
లోక్ సభలో బీజేపీ విప్ గా  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  

లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్, విప్ ల నియామకం
ప్రకటన విడుదల చేసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం
లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్ గా డాక్టర్ సంజయ్ జైస్వాల్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బీజేపీ పార్టీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని లోక్ సభలో బీజేపీ విప్ గా నియమించారు. ఇవాళ బీజేపీ హైకమాండ్ లోక్ సభలో చీఫ్ విప్ ను, 16 మంది విప్ లను నియమించింది.  లోక్ సభలో చీఫ్ విప్ గా డాక్టర్ సంజయ్ జైస్వాల్ నియమితులయ్యారు. విప్ లుగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మరో 15 మందిని నియమించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. 

చీఫ్ విప్- డాక్టర్ సంజయ్ జైస్వాల్

విప్ లు- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్మిత ఉదయ్ వాఘ్, ఖగెన్ ముర్ము, దిలీప్ సైకియా, శశాంక్ మణి, గోపాల్ జీ ఠాకూర్, సతీశ్ కుమార్ గౌతమ్, సంతోష్ పాండే, దామోదర్ అగర్వాల్, కమల్జీత్ షెరావత్, అనంత నాయక్, ధావల్ లక్ష్మణ్ బాయి పటేల్, సుధీర్ గుప్తా, కోట శ్రీనివాస్ పూజారి, దేవుసిన్హ్ చౌహాన్, జుగల్ కిశోర్ శర్మ.