పాఠశాలను తెరవాలని జిల్లా విద్యాశాఖాధికారికి విజ్ఞప్తి
Appeal to the District Education Officer to open the school
నా తెలంగాణ, డోర్నకల్: పాఠశాల మూతపడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మలిశెట్టి వేణు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న విద్యార్థులకు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదన్నారు. శుక్రవారం వేణు మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రామారావుకు వినతిపత్రం అందజేశారు. సీరోలు కొత్తూరు (సి) గ్రామ శివారులో గుజిలితండాలో ఉన్న పాఠశాలను తిరిగి తెరిపించి విద్యార్థుల చదువుకు ఆటంకాలు లేకుండా చూడాలని రామారావుకు విన్నవించారు.