మొట్టమొదటగా జపాన్ లో 6జీ పరికరం తయారీ
త్వరలోనే అందుబాటులోకి
టోక్యో: ప్రపంచంలోనే మొట్టమొదటగా 6జీ పరికరాన్ని జపాన్ ఆవిష్కరించింది. 5జీతో పోలిస్తే దీని వేగ 20 రెట్లు ఉండనుంది. 6జీని పలు కంపెనీలు సంయుక్తంగా వికసింప చేశాయి.
6జీ డివైస్ కు సంబంధించిన ప్రోటోటైప్ ను బుధవారం విడుదల చేసింది. ఇది సెకనుకు 100 గిగాబైట్స్ వేగంతో డేటా డౌన్ లోడ్ చేయగలదు.
ఈ ప్రొటోటైప్ పరికరానికి 300 అడుగు కంటే ఎక్కువ విస్తీర్ణంలో రూపొందించి విజయవంతగా దీని ద్వారా 6జీ వేగాన్ని పరీక్షించారు. అయితే ఇంకా ఫోన్ లలో 6జీని వాడే సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం మరికొంత సమయం పట్ట అవకాశం ఉంది.
డోకొమో, ఎన్టీన్టీ కార్పొరేషన్, ఎన్ ఈసీ కార్పొరేషన్, ఫుజిట్స్ సంస్థలు ఈ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఏప్రిల్ 11న ఈ పరీక్ష విజయవంతమైనట్లు ప్రకటించింది. తాము కనుగొన్న పరికరం 328 అడుగు దూరంలో నుంచి పరీక్షించామని పేర్కొన్నాయి.
6జీని వాణిజ్యం కోసం వినియోగించాలంటే మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నాయి.
కాగా భారత్ లో కూడా 6జీకి సంబంధించిన పనులను ప్రారంభించింది. 6జీతో అత్యంత వేగవంతమైన నెట్ సదుపాయం లభించనుంది. ఇప్పటికే భారత్ లో 5జీ సేవలు పలు సంస్థలు నగరాల్లో విస్తరించిన విషయం తెలిసిందే.