కోల్‌కతా పోర్ట్ ఆల్టైమ్ కార్గో హ్యాండ్లింగ్ రికార్డు
నివేదిక విడుదల చేసిన చైర్మన్రథేంద్ర రామన్
కోల్‌కతా: 1870 నుంచి కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్2023–24కు సంబంధించి ఆల్టైమ్ కార్గో హ్యాండ్లింగ్ రికార్డు సాధించిందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమంత్రిత్వ శాఖ చైర్మన్రథేంద్ర రామన్శుక్రవారం నివేదిక విడుదల చేశారు. 2023–24లో 66.4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎంఎంటీ నిర్వహణ మైలురాయిని సాధించిందన్నారు. 2022–23లో 65.66 మిలియన్ టన్నుల రికార్డుకు ఇది అధికమని పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలో 1.11 శాతం పెరుగుదల నమోదైందని నివేదికలో పేర్కొన్నారు. పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు రూ. 181.81 కోట్లతో యాంత్రీకరణ చేపడుతున్నామన్నారు. రూ. 480 కోట్లతో రెండు ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆమోద ముద్ర లభించిందన్నారు. రవాణాను మరింత సురక్షితంగా మెరుగుపర్చుకునేందుకు ఇప్పటికే అనేక వేల కోట్లతో యార్డులను అభివృద్ధి చేసుకున్నామని ప్రస్తుతం కూడా మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. దీంతో వాణిజ్య, వ్యాపార అవసరాలు వేగంగా తీర్చగలిగేందుకు పోర్టు సహాయ పడుతుందని రథేంద్ర రామన్ నివేదికలో వెల్లడించారు.