తగ్గనున్న ఎల్నినో ప్రభావం
జూలై నుంచి చురుగా రుతుపవనాల కదలిక ఈసారి 70శాతంపైనే వర్షపాతం వాతావరణ శాఖ అధికారి మతుయజనీ మహాపాత్ర
న్యూఢిల్లీ: దేశంలో ఎల్నినో ప్రభావం జూన్ అనంతరం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మత్యుజనీ మహాపాత్ర అన్నారు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య మంచి వర్షపాతాలు నమోదవుతాయని తెలిపారు. శుక్రవారం మహాపాత్ర ఎల్నినో ప్రభావంపై మీడియాతో మాట్లాడారు.
రుతుపవనాల ప్రభావం అధికం ఉంటుందని, ఇది భారత రైతాంగానికి కూడా శుభవార్తే అన్నారు. ఇప్పటికే ఎల్నినో పరిస్థితులను గమనించామన్నారు. నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రం చాలా వేడిగా మారబోదని ఇదే కారణం చేత నైరుతి రుతుపవనాలు సమయానికి చురుగ్గా కదిలే అవకాశం ఉందని తెలిపారు. ఈసారి 70 శాతం కంటేఎక్కువే వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2023లో సగటు వర్షపాతాన్ని అధిగమించి వర్షాలు కురిశాయన్నారు.