కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Bathukamma Sambaru in Canada

Oct 13, 2024 - 19:01
Oct 13, 2024 - 19:06
 0
కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు


నా తెలంగాణ, నిర్మల్: ఎల్లలు దాటినా తమ సాంప్రదాయాలను భారతీయులు మరవరన్నది నానుడి. ప్రత్యేకించి తెలంగాణా వాదులు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగను కూడా తామున్న దేశంలోనే జరుపుకొంటూ సంస్కృతిని, తమ సాంప్రదాయాన్ని మరవటం లేదు. కెనడా లోని సదరన్ ఒంటారియో తెలుగు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కిచెనర్ లో గత తొమ్మిది రోజులుగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు శనివారం ముగిశాయి. పరిసర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో హాజరై బతుకమ్మ వేడుకలను సాంప్రదాయిక పద్ధతిలో నిర్వహించారు. చివరి రోజు బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, మానస, అరుణ, మీనా, రమ్య, శృతి, రవళి, సంధ్య, శ్రీలత, సుధ తదితరులు పాల్గొన్నారు.