సంభాల్​ మసీదు సర్వేకు కోర్టు ఆదేశం

Court order for survey of Sambhal Masjid

Nov 22, 2024 - 14:33
 0
సంభాల్​ మసీదు  సర్వేకు కోర్టు ఆదేశం

ఉద్రిక్తతలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఎం

లక్నో: యూపీలోని సంభాల్​ లో హరిహర మందిరాన్ని కూల్చి జామా మసీదును నిర్మించారని హిందూ పక్షం కోర్టును ఆశ్రయించింది. దీనిపై జిల్లా కోర్టు సర్వే చేపట్టాలని ఆదేశించింది. దీంతో మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరగనుండగా పెద్ద యెత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనలు, నిరసలు చేపట్టరాదని స్థానిక డీఎం స్పష్టం చేశారు. మసీదు, మందిర  వివాదాన్ని కోర్టులో ఉన్నందున ఎవ్వరూ వివాదాలు, ఘర్షణల జోలికి వెళ్లవద్దన్నారు. ఉద్రిక్తతలకు చోటు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు బలగాలతో కలిసి శుక్రవారం ఉదయం మసీదు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. 

ఏమిటీ సంభాల్​ మసీదు వివాదం..

1529కి పూర్వం హరిహర భగవానుడి ఆలయంగా ఉండేదని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామన్నాయి. బాబర్​ 1529లో దేవాలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆరోపించారు. దీన్ని మసీదు కమిటీ, ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యతిరేకించాయి. దీంతో హిందూ పక్షాలు సంభాల్​ జిల్లా కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాయి.