విభవ్ జ్యూడీషియల్ కస్టడీ పెంపు
Judicial custody of Vibhav increased
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్ పై దాడి కేసులో విభవ్ కుమార్ జ్యూడీషియల్ కస్టడీని జూన్ 22వరకు కోర్టు పొడిగించింది. శనివారం ఈ కేసుపై విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విభవ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. దాడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద మే 16న విభవ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మే 13న స్వాతిమాలివాల్ పై సీఎం హౌస్ లో దాడి చేశారన్న ఆరోపణలు విభవ్ ఎదుర్కొంటున్నారు.