త్వరలో అందుబాటులోకి జవహార్ టన్నెల్
Jawahar Tunnel will be available soon
రూ. 62.5 కోట్లతో పునరుద్ధరణ పనులు పూర్తి
ఎన్ హెచ్ 44కు ప్రత్యామ్నాయమే టన్నెల్
అత్యాధునిక భద్రతా చర్యలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ – లేహ్ లడఖ్ ను కలిపే ట్విన్ ట్యూబ్ జవహార్ టన్నెల్ ఎట్టకేలకు మరోసారి సామాన్యులకు అందుబాటులోకి రానుంది. 1956లో నిర్మించిన 2.5 కి.మీ. పోడవైన ఈ టన్నెల్ పీర్ పంజాల్ ద్వారా కశ్మీర్ లోయ, లేహ్ లను భారత్ లోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. ఈ టన్నెల్ నిరూపయోగంగా మారడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం దీన్ని రూ. 62.5 కోట్లతో పునరుద్ధరించే పనులను చేపట్టింది. పనులు పూర్తి కావడంతో త్వరలో ఈ టన్నెల్ అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్ నేరుగా ఎన్ హెచ్–44కు ప్రత్యామ్నాయంగా నిలవనుంది. పునరుద్ధరణ పనులకు ఏడాది కాలం పట్టింది. దీంతో లేహ్ లడఖ్ ప్రాంతాలకు సామాన్య ప్రజలతోపాటు, భద్రత దళాల ప్రయాణానికి కూడా మార్గం మరింత సులభతరమయింది. ఈ టన్నెల్ లో సివిల్, ఎలక్ట్రో-మెకానికల్ పనులు వర్షం నీరు నిలవకుండా చర్యలు, దెబ్బతిన్న బాగాలను సరిచేశారు. ఎపాక్సి మోర్టార్‌తో ప్యాచ్ చేయడం, టన్నెల్ మానిటరింగ్ కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, సొరంగం శుభ్రపరచడం వ్యవస్థ మొదలైనవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. భద్రత సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచారు. టన్నెల్ లో 76 హై-డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు, పొగ, కాలుష్యం వెళ్లేందుకు ఏర్పాట్లు, ఫైర్ సెన్సార్లు, స్కాడా వ్యవస్థ, 24 గంటల పర్యవేక్షణ తదితర జాగ్రత్తలను తీసుకున్నారు. ఈ టన్నెల ద్వారా చమురు ట్యాంకర్లు, పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలు, గ్యాసోలిన్ వాహనాలు ప్రయాణించనున్నాయి.