మిట్ట మధ్యాహ్నం ముంబైలో చిమ్మ చీకట్లు

ఈదురు గాలులతో కూడిన వర్షం విమాన సేవలకు ఆటంకాలు

May 13, 2024 - 18:02
 0
మిట్ట మధ్యాహ్నం ముంబైలో చిమ్మ చీకట్లు

ముంబై: మహారాష్ర్టలో ముంబైలో మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మిట్ట మధ్యాహ్నమే కారు చీకట్లు కమ్ముకోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. రాత్రి వరకు వాతావరణం ఇలాగే కొనసాగవచ్చని ప్రజలు అప్రమత్తం ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వేడివాతావరణంతో ప్రజలకు కాస్త ఉపశమనం కూడా లభించినట్లయింది. కాగా వాతావరణం ఒక్కసారిగా భీకరంగా మారడం ఈదురుగాలులు, వర్షం పడడంతో ముంబై విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను రీ షెడ్యూల్​ చేశారు. 

వాతావరణ శాఖ హెచ్చరిక..

ముంబైలోని ఘట్కోపర్​, బాంద్రా, కుర్లా, ధారవి ప్రాంతాల్లో గంటకు 60 కి.మీ. గాలులు వీస్తాయన్నారు. మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు.