సిసోడియా బెయిల్​ సమాధానం ఇవ్వాలని ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ

హైకోర్టులో పిటిషన్​ పై విచారణ

May 13, 2024 - 17:04
 0
సిసోడియా బెయిల్​ సమాధానం ఇవ్వాలని ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ మాజీ డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ పై నాలుగు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఈడీ, సీబీఐలకు నోటీసు జారీ చేసింది. సిసోడియా బెయిల్​ విచారణ సోమవారం విచారణ చేపట్టింది. సిసోడియా తన భార్య అనారోగ్యం కారణంగా బెయిల్​ ను మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై స్పందిపంచాలని మే 8నే ఈడీ, సీబీఐలకు సుప్రీం పేర్కొంది. పిటిషన్​ విచారణ సందర్భంగా మరోసారి నాలుగు రోజుల గడువును పొడిగించింది. 

మద్యం కుంభకోణంలో సుమారు 8 గంటల విచారణ తర్వాత 2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీని తర్వాత, మనీలాండరింగ్ కేసులో ఈడి కూడా సిసోడియాను అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో సిసోడియా ఉన్నారు.