నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని పరిశ్రమలు వాటి స్థాయిని పెంచుకోవడంతోపాటు ఉత్పత్తిని మెరుగుపర్చుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అదే సమయంలో పెద్ద కలలు కనాలని వాటిని నెరవేర్చుకోవాలన్నారు. గురువారం న్యూ ఢిల్లీలో జరిగిన పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ 119వ వార్షిక సెషన్ ను ఉద్దేశించి షా మాట్లాడారు. కలలు నిజం చేసుకోవాలంటే అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. చాంబర్లు, పరిశ్రమలు సంయుక్తంగా కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వం కాలం చెల్లిన రెండువేల చట్టాలను తొలగించిందని గుర్తు చేశారు. 39వేలకు పైగా అనుమతులను సరళీకృతం చేశామన్నారు. 25 యేళ్లలో భారత్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నదే తమ దృక్పథం అని తెలిపారు. ప్రధాని మోదీకి అనుభవం, దేశ క్షేమం, అదే సమయంలో కట్టుబాట్లు తదితరాలపై దృష్టి ఉందన్నారు.
2024 పారిశ్రామిక రంగానికి నిర్ణయాత్మకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో సంక్షోభం స్పష్టంగా కనిపిస్తున్నా, భారత్ లో మాత్రం ఈ రంగంలో స్థిరంగా, వృద్ధిని నమోదు చేస్తోందన్నారు. 23యేళ్లుగా ప్రధాని మోదీ తన నిర్ణయాలతో వ్యాపారవర్గాలనే గాక ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పనిచేయడం వల్లే ప్రజలు ఆయన్ను మరోసారి ఎన్నుకున్నారని తెలిపారు.
వ్యాపార రంగంలో దేశానికి విశేష సేవలందరించిన రతన్ టాటాకు నివాళులర్పించారు. పరిశ్రమ రంగంలో ఈయన పెదన్న పాత్ర పోషించారని కొనియాడారు. ఈయన ద్వారా ప్రేరణ పొంది ఎంతోమంది పరిశ్రమ రంగాలు స్థాపించాయన్నారు. వ్యాపార దృక్పథాన్నే మార్చిన మహానీయుడు రతన్ టాటా అని సంతాపం వ్యక్తం చేశారు.