దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు ఇస్రో చీఫ్ సోమనాథ్ సూచన
Isro chief Somnath suggested setting up libraries in temples
తిరువనంతపురం: దేవాలయాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వల్ల మరింత యువతను సన్మార్గంలో నడిపేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు. శనివారం తిరువనంతపురంలోని ఉదియనూర్ ఆలయంలో అవార్డు వేడుకల్లో సోమనాథ్ పాల్గొని ప్రసంగించారు. లైబ్రరీల ఏర్పాటు వల్ల దేవాలయాలను సందర్శించే యువత సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. ఆ దిశగా దేవాలయ నిర్వాహకులు కృషి చేయాలని తెలిపారు. చాలామంది నిరుపేద విద్యార్థులకు కూడా గ్రంథాలయాల ఏర్పాటు వల్ల చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. దేశంలో జరుగుతున్న పోటీ పరీక్షల నేపథ్యంలో కూడా ఈ గ్రంథాలయాలకు ఆదరణ కూడా పెరిగే అవకాశం ఉందని సోమనాథ్ స్పష్టం చేశారు. ప్రజలు కేవలం నామస్మరణ చేయడానికే కాకుండా సమాజాన్ని మార్చాలనే లక్ష్యంతో ఆలయానికి వెళ్లాలని సోమనాథ్ విజ్ఞప్తి చేశారు.