భారత్–భూటాన్ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం
ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భూటాన్–భారత్ లది విశిష్ట భాగస్వామ్యామని దీనికి కట్టుబడి ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం భూటాన్ రాజు జిగ్మేఖేసర్ నామ్ గేల్ వాంగ్ చుక్, క్వీన్ జెట్సన్ పెమా వాం చుక్ లను న్యూ ఢిల్లీలో కలిశారు. ఇరువురి మధ్య జరిగిన సమావేశంలో దౌత్యపరమైన, భద్రతాపరమైన అంశాలను చర్చించారు. అదే సమయంలో భౌగోళిక అంశాలపై కూడా చర్చించారు. భూటాన్ రాజు రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ స్వాగతం పలికారు. అనంతరం భారత్–భూటాన్ స్నేహ బంధాన్ని బలోపేతం చేయడంలో విదేశాంగ మంత్రి జై శంకర్ తో రాజు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పరస్పర విశ్వాసం, నమ్మకాన్ని వ్యక్తం చేశారు.