ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి ఆమోదముద్ర
Israeli–Hamas ceasefire cease fire
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యూఎన్ఎస్ సీ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి) ఇజ్రాయెల్–హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. సోమవారం జరిగిన ప్రతిపాదన వివరాలను భద్రతా మండలి మంగళవారం వెల్లడించింది. యుద్ధం ముగించడంలో కేవలం ప్రతిపాదనల కృషి సరిపోదని ఇరుదేశాలు కూడా ఒకే వైఖరితో ఉండాలని పేర్కొంది. అమెరికా ఇటీవలే ఇరుదేశాల యుద్ధం ముగించేందుకు మూడు ప్రతిపాదనలు చేసింది. దాడులు ఆపడం, బందీలను విడుదల చేయడం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం వీటిలో ప్రధానమైనవి. వీటిని ఇజ్రాయెల్ అంగీకరించింది. యూఎన్ ఎస్ సీ కూడా అమెరికా ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ఇక యుద్ధాన్ని నివారించే చర్యలపై హమాస్ బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రపంచం దృష్టి ఇప్పుడు హమాస్ పై ఉంది. ఇటీవలే హమాస్ ప్రతిపాదనను స్వాగతించింది. చర్చలకు సిద్ధమని పేర్కొంది. కానీ బందీల విడుదలపైనే స్పష్టం చేయలేదు. భద్రతా మండలిలో ఇరుదేశాల మధ్య యుద్ధం నిలిపివేయాలన్న ప్రతిపాదనలపై జరిగిన ఓటింగ్ లో రష్యా పాల్గొనకపోవడం విశేషం.