మాల్దీవులుకు భారత్ ఉపశమనం 150 మిలియన్ల రుణం చెల్లింపునకు గడువు పెంపు
మంత్రి మూసా జమీర్ వెల్లడి ఆర్థిక రంగం కుదేలుతో సత్సంబంధాలకు ప్రయత్నం
మాల్దీవులు భారత్ పెద్ద ఉపశమనం కల్పించింది. భారత్ కు ఇవ్వాల్సిన 150 మిలియన్ల రుణాన్ని తిరిగి చెల్లించేందుకు గడువును పొడిగించింది. ఆదివారం మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రి మూసా జమీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి, మాల్దీవులు విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమైనట్లు దీని ద్వారా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ గడువును పొడిగించింది. అదే సమయంలో తమ దేశంలో భారత్ నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుందన్నారు. మోదీపై మొయిజ్జు వ్యాఖ్యలతో మాల్దీవులుతో భారత్ కు ఆజ్యం పోసినట్లయ్యింది. మోదీ పిలుపుతో ఒక్కసారిగా ఆ దేశ ఆర్థిక రంగమే కుదేలయ్యే స్థాయికి చేరుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ మొయిజ్జు చివరికి భారత్ తో సత్సంబంధాలే మేలన్న నిర్ణయానికి వచ్చారు.