బుర్కే ఇంట్లో విద్యుత్​ మీటర్ల ట్యాంపరింగ్​

Electricity meter tampering at Burke's house

Dec 19, 2024 - 12:31
 0
బుర్కే ఇంట్లో విద్యుత్​ మీటర్ల ట్యాంపరింగ్​

నెలకు 16,480 యూనిట్ల విద్యుత్​ వినియోగం
జీరోనే చూపిస్తున్న రెండు మీటర్లు
స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయన్న అధికారులు
భారీ పోలీసు బందోబస్తు మధ్య తనిఖీలు

లక్నో: సంభాల్​ కేసులో నిందితుడైన ఎంపీ జియా ఉర్​ రెహ్మాన్​ బుర్కే అక్రమంగా నిర్మించిన ఇంట్లో విద్యుత్​ చౌర్యానికి పాల్పడ్డారు. గురువారం ఆయన ఇంటికి వచ్చిన విద్యుత్​ అధికారులు రెండు మీటర్లు, ఇంటిని పూర్తిగా తనిఖీ చేశారు. మీటర్లలో రీడింగ్​ జీరోగా చూపిస్తుంది. కానీ ఆయన ఇంట్లో గ్రౌండ్​ ఫ్లోర్​ నెలకు 3253 యూనిట్లు, మొదటి అంతస్తు 8234 యూనిట్లు, రెండో అంతస్తు 4993 యూనిట్ల విద్యుత్​ ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 83 బల్బులు, 19 ఫ్యాన్లు, 3 ఏసీలు ఉన్నట్లు విద్యుత్​ శాఖ అధికారులు మీడియాకు వివరాలు విడుదల చేశారు. మీటర్ల ట్యాంపరింగ్​ పాల్పడ్డట్టు స్పష్​టమైన ఆధారాలు లభించాయన్నారు. గతేడాదిగా  ఈ విద్యుత్ మీటర్ల రీడింగ్​ జీరోగానే ఉందని అధికారులు తెలిపారు. ఇంట్లో 16,480 వాట్ల విద్యుత్​ ఉపకరణాలు వాడుతున్నట్లు గుర్తించామన్నారు. కాగా విద్యుత్​ శాఖాధికారులు బుర్కే ఇంట్లో తనిఖీలు నిర్వహించేందుకు రాగా ఆయన తండ్రి బెదిరించినట్లు సమాచారం. అధికారుల వెంట భారీ పోలీసు బందోబస్తు ఉండడంతో చేసేదేమీ లేక తనిఖీలకు సహకరించారు. భారీ ఎత్తున ర్యాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​ ను రంగంలోకి దింపడంతో ఎంపీ మద్ధతు దారులు వెనుదిరిగారు. అనంతరం విద్యుత్​ శాఖాధికారులు తమ పనులకు ఉపక్రమించారు.