కుల్గామ్​ లో ఎన్​ కౌంటర్​ ఐదుగురు ఉగ్రవాదులు మృతి

Five terrorists killed in encounter in Kulgam

Dec 19, 2024 - 11:36
 0
కుల్గామ్​ లో ఎన్​ కౌంటర్​ ఐదుగురు ఉగ్రవాదులు మృతి

ఇద్దరు జవాన్లకు గాయాలు

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లోని కుల్గామ్​ లో ఎన్​ కౌంటర్​ జరిగింది. గురువారం జరిగిన ఈ ఎన్​ కౌంటర్​ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్​ లోని బెహిబాగ్​ కద్దర్​ గ్రామంలో ఉగ్రవాదులున్నట్లుగా ఆర్మీకి సమాచారం అందింది. వెంటనే సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆ ప్రాంతంలో కార్డెన్​ సెర్చ్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందజేస్తున్నారు. ఇంకా ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకోలేదని అధికారులు తెలిపారు. ఇంకా సెర్చింగ్​ ఆపరేషన్​ కొనసాగుతుందన్నారు.

మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో సమావేశం కానున్నారు. సెప్టెంబర్–-అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇదే తొలి సమావేశం కావడం విశేషం. ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ సీనియర్ అధికారులు, పారామిలటరీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, హోం మంత్రిత్వ శాఖ ఉంటారు. అంతకుముందు జూన్ 16న కూడా షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని, ఉగ్రవాదులకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.