ఆరోదశలో 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలు
1.14 lakh polling stations in Arodasha
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరోదశ ఎన్నికలు శనివారం ఉదయం 7 ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసం 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ దశలో 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు ఉండగా, 5120 మంది ఇతరులున్నారు. 85 ఏళ్లకు పైబడిన వారు 8.93 లక్షలమంది ఉన్నారు. వందేళ్లకు పైబడిన వారు 23,659మంది ఉండగా, 9.59 లక్షలమంది దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటేసేలా ఈసీ చర్యలు తీసుకుంది.
హీట్ వేవ్ ను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. షామియానాలు వేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. కేంద్రాల వద్ద భద్రతతోపాటు మెడికల్ టీమ్ లు అంబులెన్సులను ఏర్పాటు చేశారు.