మిని గురుకులంలో దరఖాస్తులకు ఆహ్వానం
Invitation for applications for Mini Gurukul
నా తెలంగాణ, డోర్నకల్: మహాబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మిని గురుకులం(బాలికల)లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిని ఏవీ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు ఆరు సంవత్సరాలు కలిగిన బాలికలు అర్హులని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 30 సీట్లు, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బ్యాక్ లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గురుకులంలో ఉన్న మరిపెడ మండలానికి చెందిన విద్యార్థులకీ మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎంపికైనా విద్యార్థులకు ఉచిత భోజనం వసతి, పుస్తకాలు, నోట్ బుక్స్, బెడ్ షీట్స్ తదితర అన్నిరకాల సౌకర్యాలు కల్పించడాం జరుగుతుందన్నారు. ఈ నెల 10 వ తేదీ నుంచి 18 వ తేదీ లోపు ఆసక్తి కలవారు నేరుగా మినీ గురుకులానికి వచ్చి సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు ఇంచార్జి హెచ్ ఎం నెంబర్ 9381153893ను సంప్రదించాలని కోరారు.