మోదీ మేక్​ ఇన్​ ఇండియాకు స్పందించే పెట్టుబడులు

Investments in response to Modi's Make in India

Jul 19, 2024 - 21:39
 0
మోదీ మేక్​ ఇన్​ ఇండియాకు స్పందించే పెట్టుబడులు
  • ట్రాన్స్​ మిషన్​, డిస్ట్రిబ్యూషన్ పరికరాలను ఉత్పత్తిని పెంచుతాం
  • విదేశాలలోనూ మార్కెట్​ ను విస్తరిస్తాం
  • భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు అవకాశం
  • భారత్​ లో ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ. 500 కోట్ల పెట్టుబడి
  • జపనీస్​ తోషిబా సంస్థ చైర్మన్​, ఎండీ హిరోషి ఫురుటా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ లో విద్యుత్​​ ట్రాన్స్​ మిషన్​, డిస్ట్రిబ్యూషన్ పరికరాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచడానికి 10 బిలియన్ జపనీస్ యెన్ (రూ. 500 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు తోషిబా గ్రూప్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫురుటా స్పష్టం చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మేక్​ ఇన్​ ఇండియా’ పిలుపునకు స్పందించి పెట్టుబడులను పెట్టనున్నామన్నారు. భారత్​ తోపాటు విదేశాలలోనూ తమ వ్యాపార మార్కెట్​ ను విస్తరించుకుంటామని తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా ట్రాన్స్‌మిషన్ గ్రిడ్‌లు, పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్​ ట్రాన్స్‌ఫార్మర్‌ల ఉత్పత్తి, టెస్ట్ లైన్ సామర్థ్యాన్ని పెంచుకుంటామని హిరోషి తెలిపారు. 

ట్రాన్స్‌ఫార్మర్‌ల డిమాండ్​ తీరుస్తాం..

ఇక్కడ సాధించిన ఉత్పత్తులను విదేశాల్లో ఎగుమతి చేయడంతోపాటు 400, 765 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్‌ల డిమాండ్​ ను తీరుస్తామన్నారు. భారత్​ లో తమ ఉత్పత్తి సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉందన్నారు. 

1.5 రెట్ల ఉత్పత్తి పెంపుదలే లక్ష్యం..

2023తో పోలిస్తే భారత్​ లో 2024 నుంచి 2026 వరకు విద్యుత్​ ట్రాన్స్​ ఫార్మర్లు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ల తయారీ సామర్థ్యాన్ని దాదాపు 1.5 రెట్లు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

పునరుత్పాదక వస్తువుల ఉత్పత్తి సామర్థ్యం పెంపు..

వీటితోపాటు సర్జ్​ అరెస్టర్​ లు, ఫోటోవోల్టాయిక్​, ఇన్వర్టర్​ లు, పవర్​ ట్రాన్స్​ ఫార్మర్లు, గ్యాస్​ ఇన్సులేటెడ్​ స్విచ్​ గేర్​, ఇన్వర్టర్​ డ్యూటీ ట్రాన్స్​ ఫార్మర్​ లాంటి సహా పునరుత్పాదకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు తోషిబా ఎండీ హిరోషి ఫురుటా స్పష్టం చేశారు.