కిషన్​ రెడ్డి విజయం

పారని ప్రతిపక్షాల పాచికలు ఓట్లు చీల్చేందుకు భారీగా రంగంలోకి స్వతంత్రులు

Jun 4, 2024 - 13:22
Jun 6, 2024 - 13:00
 0
కిషన్​ రెడ్డి విజయం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ స్థానం నుంచి మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాలలో ముందంజలో కొనసాగుతున్నారు. 2019లో ఇదే స్థానం నుంచి కిషన్​ రెడ్డి పోటీ చేసి 3,84, 780 ఓట్లు సాధించారు. 42.47 శాతం షేర్​ బ్యాంకును సొంతం చేసుకున్నారు. ఈసారి కేంద్రమంత్రిని ఓడించాలనే ప్రయత్నాన్ని విపక్షాలు గట్టిగానే చేసినా వారి పాచికలు పారలేదు. ఏకంగా 40 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి స్వతంత్రులుగా రంగంలోకి దిగడం గమనార్హం. ముఖ్యంగా బీజేపీ ఓటు బ్యాంకు షేర్​ ను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రకంగా వివిధ వర్గాలు, మతాలు, కులాల వారీగా ప్రతిపక్షాలు నామినేషన్​ లో వేయించి పోటీలో నిలబెట్టినా వారి పాచికలు పారకపోవడం విశేషం.ఈ స్థానంలో కిషన్​ రెడ్డి విజయం ఖాయమే. 

మోదీ సారథ్యంలో కిషన్​ రెడ్డి వినూత్నరీతిలో ప్రచారంతోనే సత్ఫలితాలు సాధించారు. ఎన్నికలకు ముందు ఆయన భారీగా కసరత్తు చేశారు. తన నియోజకవర్గంలోని ఏ ఒక్క ప్రాంతాన్ని వదలకుండా జల్లెడ పడుతూప్రచార శైలిలో దూసుకుపోయారు. దీంతో ప్రతిపక్షాల కుట్రలకు ఓటర్లే చెక్​ పెడుతూ కేంద్రమంత్రితోనే తమ ప్రాంతాల అభివృద్ధి దాగి ఉందనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ తీర్పునిచ్చారు.