పేలుడులో మృతి చెందిన రష్యా న్యూక్లియర్ చీఫ్
ప్రతీకారం తప్పదన్న రష్యా
మాస్కో: రష్యా న్లూక్లియర్ చీఫ్ పేలుడులో మృతి చెందాడు. మంగళవారం ఇగోర్ కిరిల్లోవ్ తన ఇంటి నుంచి బయటికి వస్తుండగా పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఇగోర్ తోపాటు, అతని సహాయకుడు కూడా మృతిచెందాడు. పేలుడుపై రష్యా దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బాంబు అమర్చి పేల్చినట్లు గుర్తించారు. పేలుడు కోసం 200 గ్రాముల టీఎన్ టీని ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఇగోర్ 2017లో అణు దళాల చీఫ్ గా నియమితులయ్యారు. రేడియేషన్, రసాయన, జీవ ఆయుధాల విభాగాలకు చీఫ్‌గా పనిచేశాడు. ఇగోర్ కిరిల్లోవ్ ఉక్రెయిన్ తో యుద్ధంలో నిషేధిత రసాయన ఆయుధాలను వాడారనే ఆరోపణలపై ఉక్రెయిన్ సెక్యూరిట సర్వీస్ అతనిపై ఆంక్షలు విధించింది. కాగా కిరిల్లోవ్ హత్యపై రష్యా తీవ్రంగా ప్రతిస్పందించింది. రష్యా పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ..కిరిల్లోవ్ హత్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.