రేపే సీఎం రాజీనామా?
పీఏసీలో నూతన సీఎంపై నిర్ణయం వెల్లడించిన ఆప్ నేత సౌరభ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి మంగళవారం రాజీనామా సమర్పించనున్నారు. సోమవారం ఆప్ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై సమాచారం అందించారు. సీఎం రాజీనామా అనంతరం పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉంటుందన్నారు. పీఏసీ, శాసనసభ పక్ష సమావేశంలో సీఎం పదవిని ఎవరు చేపట్టాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మనీష్ సిసోడియా సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై సోమవారం సాయంత్రం కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు. కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ మంత్రి అతిషి, గోపాల్ రాయ్ సీఎం అభ్యర్థులుగా ముందువరుసలో ఉన్నారు.