ఇండోర్​–అహ్మాద్​ పై ఘోర ప్రమాదం

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు ఎనిమిది మంది దుర్మరణం

May 16, 2024 - 15:05
 0
ఇండోర్​–అహ్మాద్​ పై ఘోర ప్రమాదం

జైపూర్​: ఇండోర్​–అహ్మదాబాద్ హైవేపై బుధవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకొని ఎనిమిది మంది మృతిచెందారు. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద వివరాలను గురువారం ఉదయం డీఎస్పీ ఉమాకాంత్ చౌదరి మీడియాకు వివరించారు. హైవే బెట్మా సమీపంలో బుధవారం అర్థరాత్రి ప్రమాదం చోటు చేసుకుందన్నారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉందని తెలిపారు. గురువారం ఉదయం వరకు అన్ని మృతదేహాలను ఇండోర్​ జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. 

కారులో ప్రయాణిస్తున్న వారంతా అలీరాజ్​ పూర్​ లోని బోరి గ్రామానికి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. డ్రైవర్​ ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యాడని పేర్కొన్నారు. మృతుల్లో ఒక కానిస్టేబుల్​ కూడా ఉన్నారని వివరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామ డీఎస్పీ ఉమాకాంత్​ తెలిపారు.