మాలివాల్​ పై దాడి నిందితుడిపై చర్యలేవి

వైభవ్​  గుండాయిజంకు సీఎం హౌస్​ కేరాఫ్​ అన్న బీజేపీ.. మహిళా సంఘం సీరియస్​.. నోటీసులు జారీ

May 16, 2024 - 14:33
 0
మాలివాల్​ పై దాడి నిందితుడిపై చర్యలేవి

నా తెలంగాణ, న్యూఢిల్లీ: స్వాతి మాలివాల్​ పై దాడి జరిగి 72 గడిచినా ఇంతవరకు ఆ పార్టీ నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ భాటియా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైభవ్​ కుమార్​ సీఎం కేజ్రీవాల్​ వెంట విమానాశ్రయంలో ఉన్న ఫోటోను రిలీజ్​ చేశారు. పలు విమర్శలు గుప్పించారు. ఈ ఫోటోను చూస్తే కేజ్రీవాల్​, వైభవ్​ కుమార్​ లు కూడబలుక్కునే ఆమెపై దాడికి పాల్పడ్డారని స్పష్టం అవుతూందని మండిపడ్డారు. సీఎం హౌస్​ గుండాయిజంకు కేరాఫ్​ గా మారిందా? అని ప్రశ్నించారు. అఖిలేష్ తో కేజ్రీవాల్​ మీడియా సమావేశం నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఫోటో బుధవారం రాత్రిదేనని అర్థం అవుతూందని స్పష్టం చేశారు. ఒక మహిళకు ఆప్​ పార్టీలో ఇచ్చే గౌరవం ఇదే అని మండిపడ్డారు. తాము రాజకీయాలకు అతీతంగ సాక్షి మాలివాల్​ పక్షాన ఉన్నామని గుర్తు చేశారు. 

మహిళా ఎంపీని కొట్టిన వ్యక్తిని చంకలో పెట్టుకొని సీఎం తిరగడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు. చర్యలుంటాయని సంజయ్​ సింగ్​ తెలియజేశారు. సాక్షాత్తూ సీఎం కేజ్రీవాల్​ అక్రమ మద్యం కేసులో ఇరుక్కుపోతే ఆ పార్టీతో ఇంకేమీ న్యాయం ఆశించగలమన్నారు. మరోవైపు ఆమె ఫిర్యాదు చేసేందుకు వెళితే ఆమెను భయపెడుతున్నారని మండిపడ్డారు.

సీఎం కేజ్రీవాల్​ వెంట బుధవారం రాత్రే లక్నో వెళ్లిన వైభవ్​ కుమార్​ గురువారం ఎస్పీ నాయకుడితో సమావేశం సందర్భంగా సీఎం కారులో కూర్చొని  ఉండడం మీడియాకు కనిపించడం విశేషం. మొత్తానికి వైభవ్​ కుమార్​ దాడి సీఎం కనుసన్నల్లోనే జరిగిందనడానికి నిదర్శనమని బీజేపీ ఆరోపిస్తోంది.

మహిళా హక్కుల సంఘం సీరియస్​..నోటీసులు జారీ..

మరోవైపు స్వాతి మాలివాల్​ పై దాడి ఘటనపై రాష్ర్ట మహిళా హక్కుల సంఘం సీరియస్​ అయింది. దీని పూర్వాపరాలేంటో తెలుసుకోవాలని మే 17వ తేదీ ఉదయం వరకు నిందితుడు వైభవ్​ కుమార్​ ను తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.