యూఎన్ఎస్ సీలో భారత్ సభ్యత్వం
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మద్ధతు
న్యూయార్క్: యూఎన్ఎస్ సీ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి)లో శాశ్వత సభ్యదేశంగా భారత్ చేరికను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తన మద్దతును తెలిపారు. గురువారం యూఎన్ 79వ సెషన్ లో ఆయన చర్చలో పాల్గొని భారత్ చేరికకు తన మద్ధతు ప్రకటించారు. అలాగే జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఆఫ్రిగాకు ప్రాతినిధ్యం వహించే దేశాల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని మాక్రాన్ తెలిపారు. యూఎన్ఎస్ సీలో భారత్ చేరికకు అమెరికాతోపాటు పలుదేశాలు తమ మద్ధతును ప్రకటించాయి.