భారత్​ దెబ్బకు బంగ్లా అబ్బా..!

Bangla-abba-to-Indias-blow

Dec 18, 2024 - 13:09
Dec 18, 2024 - 13:10
 0
భారత్​ దెబ్బకు బంగ్లా అబ్బా..!

నిమ్మలంగానే ధనాధన్​
బంగ్లాలో సివిల్​ వార్​ కు అవకాశం
మూతపడుతున్న టెక్స్​ టైల్స్​ ఇండస్ర్టీ పరిశ్రమలు
యూనస్​ ఇళ్లు, కార్యాలయాల ముందు కార్మికుల ఆందోళనలు
సరిహద్దు వద్ద ఎక్కడి వాహనాలక్కడే గప్​ చిప్​
ఉల్లి, పెట్రోల్​, కాయకూరలకూ కరవే!
స్పెర్​ పార్ట్స్​ లేక మూలనపడుతున్న వాహనాలు
హోటల్స్​ ఆహారం, ఆసుపత్రుల్లో వైద్యం నో
మూడీస్​ నివేదికతో మరింత కలవరపాటు
భారత్​ కన్నెర్రతో నాలుగైదు రోజుల్లోనే డోలాయమానంలో ఆర్థిక పరిస్థితి
ప్రపంచదేశాల వైపు బేలచూపులు చూస్తున్న యూనస్​ ప్రభుత్వం
మొంకిపట్టు, బీరాలకు పోయి పరువు పోగొట్టుకుంటున్న తాత్కాలిక ప్రభుత్వం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అనే నానుడి అందరికీ తెలిసిందే. అదిగో అచ్చం ఇలాగే ఇప్పుడు భారత్​ కొడుతున్న ఆర్థిక దెబ్బకు బంగ్లాదేశ్​ యూనస్​ ప్రభుత్వం అబ్బా అనక తప్పని పరిస్థితి ఏర్పడింది. మోదీ ప్రభుత్వం నిమ్మలంగానే కొడుతున్న (ధనాధన్​) ఈ దెబ్బలతో ఇక బంగ్లాదేశ్​ లో మరోమారు సివిల్​ వార్​ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం ఇష్టం లేకనే భారత్​ అనేకమార్లు బంగ్లాదేశ్​ యూనస్​ ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇస్కాన్​ చిన్మయ్​ కృష్ణదాస్​ ను విడిచిపెట్టాలని, హిందువులు, దేవాలయాలపై దాడులు ఆపాలని శాంతియుతంగానే అనేకమార్లు ప్రయత్నించింది. మైనార్టీలకు భద్రత కల్పించాలని విన్నవించింది. భారత్​ వల్లించిన శాంతి మంత్రం కాస్త బంగ్లాకు బలుపెక్కించింది. దీంతో మరింత రెచ్చిపోయిన యూనస్​ సర్కార్​ తో చేతులు కలిపిన ఉగ్రమంత్రులు భారతీయులపై ఏ మాత్రం దాడులు ఆపకపోగా మరింత ఎక్కువ చేశారు. 

యాక్షన్​ మోడ్​ లోకి భారత్​..
ఇక అనేకసార్లు చెప్పినా వినకపోవడంతో మోదీ సర్కార్​ యాక్షన్​ లోకి దిగింది. యాక్షన్​ లోకి దిగేముందు కూడా ఓసారి చివరి హెచ్చరిక చేసింది. డిసెంబర్​ 9న విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ బంగ్లాదేశ్​ కు వెళ్లి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి భారతీయులపై దాడులను తీవ్రంగానే ఖండించారు. ఆపకుంటే బంగ్లాతో బంధాలు మరింత దిగజారుతాయని హెచ్చరించారు. ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టిన ఆ దేశ ప్రభుత్వం భారతీయులకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇక మోదీ ప్రభుత్వం డిసెంబర్​ 15న యాక్షన్​ మోడ్​ లోకి దిగి యాక్టివేట్​ అయింది. 

బంగ్లా నుంచి భారత్​ కు టెక్స్​ టైల్స్​ పరిశ్రమ షిఫ్ట్​..
టెక్స్​ టైల్స్​ ఇండస్ర్టీస్​ కి బంగ్లా పెట్టింది పేరు. 90 శాతం ఉత్పత్తులను భారత్​ కే అమ్ముతుంది. ఇందుకు కావాల్సిన కాటన్​ ను కూడా భారతదేశమే బంగ్లాదేశ్​ కు పంపిస్తుంది. ప్రస్తుతం భారత్​ కాటన్​ ఆపివేయడంతో అక్కడ ఇండస్ర్టీలో పనిచేస్తున్న కార్మికులంతా పెద్ద యెత్తున ప్రధాని నివాసం ముందు రోజుకో తీరులో ధర్నాలకు దిగుతున్నారు. మంత్రులు, కార్యాలయాల వద్ద నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. యూనస్​ ప్రభుత్వం తమ పొట్టలు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటన్​ సరఫరా నిలిచిపోవడంతో ఇండస్ర్టీలు మూలనపడే పరిస్థితులు వచ్చాయి. పలుమార్లు ఈ సంస్థల యాజమాన్యాలు కూడా భారత్​ మాట వినాలని యూనస్​ సర్కార్​ కు నచ్చచెప్పినా వినకపోవడంతో ఆ కంపెనీలు తమ తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్​ లోని సూరత్​ కు పయనమయ్యాయి. రూ. 10వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టాలని నిర్ణయించి భూమిపూజలు, శంకుస్థాపనలు కూడా చేసేశాయి. దీంతో బంగ్లాలో ఇక నిరుద్యోగం తాండవించనుందనేది స్పష్టం అవుతుంది. 

సరిహద్దు వద్ద ఎక్కడివాహనాలక్కడే..


పెట్రాపోల్​, బీనాపోల్​ సరిహద్దులోని ట్రక్కులు నిలిచే ఆసియాలోనే అతిపెద్ద యార్డు. ఎగుమతులు, దిగుమతులకు భారత్​–బంగ్లాలోకి వెళ్ళేముందు ఈ సరిహద్దుల వద్దే ట్రక్కులు నిలుస్తుంటాయి. అనంతరం సరిహద్దు చెకింగ్​ తర్వాత దేశాల్లోకి ఎంటర్​ అవుతాయి. ప్రస్తుతం భారత్​ ఎగుమతులు, దిగుమతులను జనవరి 15 వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత్ కు కూరగాయలు, ఉల్లిపాయల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అలాగే బంగ్లా నుంచి వచ్చే ట్రక్కులు భారీ యెత్తున పెట్రా, బీనాపోల్​ ల వద్ద ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాన్స్​ పోర్టేషన్​ కు కూడా కష్టాలు చుట్టుముట్టాయి. మరోవైపు యూనస్​ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచదేశాల వైపు బిక్కచూపులు చూస్తుంది. 

యూనస్​ కు వ్యతిరేకంగా నిరసనలు.. 
ఢిల్లీ కాశ్మీరీ గేట్​ నుంచి బంగ్లాదేశ్​ లోని 90 శాతం వాహనాలకు స్పేర్​ పార్ట్​స్​ వెళుతుంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వ్యాపారులంతా బంగ్లాకు ఎలాంటి స్పేర్​ పార్ట్స్​ అమ్మవద్దని నిర్ణయించడంతో వాహనాలు క్రమేణా మూలనపడుతున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్​ లో ఉన్న హోటల్​ యాజమానులంతా బంగ్లా వ్యాపారులకు రూమ్​ లు, ఆహారం ఇవ్వొద్దని నిర్ణయించారు. దీంతో బంగ్లా వ్యాపారులకు భారీ దెబ్బ పడుతుంది. వీరు కడా యూనస్​ సర్కార్​ వెంటనే దిగిపోతే మంచిదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఫెడరేషన్​ ఇండియా యూరోపియన్​ ఆర్గనైజేషన్​ ఉల్లి, పెట్రోల్​ సరఫరాను బంగ్లాకు పూర్తిగా నిలిపివేసింది. బంగ్లాకు దెబ్బమీద దెబ్బల రుచిని భారత్​ రోజుకో విధంగా చూపెడుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో హాసీనా ప్రభుత్వంలో తిప్పలు లేవని యూనస్​ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని నిరసనలు చేపడుతున్నారు. త్రిపుర ఆసుపత్రుల్లో బంగ్లాదేశీయులకు వైద్యాన్ని పూర్తిగా నిరాకరించారు. దీంతో ఆ దేశం రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. 

మూడీస్​ నివేదికతో మరిన్ని ఆర్థిక కష్టాలు..


అంతిమంగా భారత్​ కేవలం మూడు, నాలుగు రోజుల దెబ్బలకే మూడీస్​ అనే అంతర్జాతీయ సంస్థ(ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులపై విశ్లేషించి ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అని ప్రపంచదేశాలకు చెప్పే సంస్థ) బంగ్లాదేశ్​ లో ప్రపంచదేశాలు పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించింది. బంగ్లాలో పెట్టుబడులు క్షేమకరం కాదని పేర్కొంది. అదే సమయంలో భారత్​ మరింత ఆర్థికంగా పటిష్ఠంగా ఉందని ఇక్కడ ఎన్నైనా పెట్టుబడులను పెట్టుకోవచ్చని సురక్షితంగా ఉంటాయని వెల్లడించింది. ఈ పరిణామంతో బంగ్లాకు మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి.  ఏది ఏమైనా భారత్​ నిదానంగా కొడుతున్న దెబ్బలకు బంగ్లా అబ్బా అంటోంది.