దుబాయ్ లో ఐఐఎఫ్ టీ
కేంద్రమంత్రి పీయూష్ గోయల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: త్వరలోనే దుబాయ్ లో ఐఐఎఫ్ టీ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) నూతన క్యాంపస్ ను ప్రారంభించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సోమవారం న్యూఢిల్లీ ఐఐఎఫ్ టీ 57వ స్నాతకోత్సవంలో వర్చువల్ గా ప్రసంగించారు. భారత్ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నారు. గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించిన యువత కీలకపాత్ర పోషించగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది దేశ యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి దేశ భవిష్యత్ నిర్మాణంలో కీలకపాత్ర వహించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.