లావోస్ ఆసియా సదస్సుకు ప్రధాని మోదీ
రెండు రోజుల పర్యటన వివరాలు వెల్లడించిన మంత్రిత్వశాఖాధికారి జైదీప్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లావోస్ లో జరిగే ఆసియన్ ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. గురువారం నుంచి రెండు రోజులపాటు లావోస్ లోని వియంటియాన్ లో పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖాధికారి జైదీప్ మజుందార్ బుధవారం విలేఖరులకు తెలిపారు. ఈ సమావేశం 21వది అన్నారు. ఈ సమ్మిట్ లో హాజరై పలుదేశాలతో ద్వైపాక్షిక బంధాలపై కూడా చర్చించి ప్రసంగిస్తారని జైదీప్ తెలిపారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడం ఇది పదోసారి అని తెలిపారు. లావోస్ ప్రధాని సోనెక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు ప్రధాని పర్యటనను చేపట్టనున్నారని తెలిపారు. భవిష్యత్ లో ఆసియా దేశాల మధ్య సంబంధాల పురోగతిపై సమీక్షించనున్నారని, ప్రణాళికలను కూడా రూపొందిస్తారని మజుందార్ తెలిపారు.