అణుశక్తిలో ఆత్మనిర్భర్ దిశగా భారత్
రాజ్యసభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశం అణుశక్తి రంగంలో ఆత్మనిర్భర్ దిశగా పట్టు సాధించిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. రాజ్యసభలో గురువారం ఆయన ఒక ప్రశ్నకు జవాబుగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అణు విద్యుత్ సామర్థ్యం 8180 మెగావాట్ల నుంచి 2031–32 నాటికి 22,840 మెగావాట్లకు పెంచుకుంటామని తెలిపారు. నిర్మణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. అదనంగా మొత్తం 7300 మెగావాట్ల సామర్థ్యంతో తొమ్మిది రియాక్టర్లు నిర్మాణం, ప్రారంభ దశలో ఉన్నాయని, 7000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పది రియాక్టర్లు ప్రీ-ప్రాజెక్ట్ కార్యకలాపాలలో ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్ అణు వినియోగంలో పూర్తి సాధికారత పొందిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.