హర్ ఘర్ నల్ సే జల్ ద్వారా 15.04 కోట్ల గ్రామీణ కుటుంబాకు తాగునీరు
కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి వి. సోమన్న
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగస్ట్ 5 నాటకి 15.04 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు ప్రధానమంత్రి మోదీ ప్రవేశ పెట్టిన ‘హర్ ఘర్ నల్ సే జల్’ ద్వారా కుళాయి ద్వారా నీరు అందుతోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి వి. సోమన్న అన్నారు. గురువారం ఆయన ఈ విషయాన్ని లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
2019 ఆగస్ట్ లో జల్ జీవన్ మిషన్ ప్రారంభంలో 3.23 కోట్లు (16.8)శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్ లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా అందిన నివేదిక ప్రకారం అదనంగా 11.81 కోట్ల అదనపు కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. దీంతో 15.04 (77.87) శాతం కంటే ఎక్కువ కుటుంబాకు కుళాయి ద్వారా నీరు అందుతోందన్నారు.
ప్రతీ కుటుంబానికి నాణ్యమైన నీటిని కుళాయి ద్వారా అందిచడమే లక్ష్యం ప్రధాని చేపట్టిన ఈ కార్యక్రమంలో సత్ఫలితాలనిచ్చిందని అన్నారు. రాబోయే సమయంలో వందశాతం కుటుంబాలకు కుళయిల ద్వారా నీరందించడమే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వి. సోమన్న తెలిపారు.