పన్నూన్ పై వాషింగ్టన్ కథనం మండిపడ్డ భారత్
ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఊహాజనిత కథనాలు ఉద్రిక్తతతలకు కారణాలు ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాం బాధ్యతారాహిత్య కథనాలు సరికాదు
నా తెలంగాణ, న్యూఢిల్లీ: పన్నూన్ హత్యకు కుట్ర పన్నారనే అమెరికా మీడియా కథనంపై మంగళవారం భారత్ స్పందించింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనంలోని అసమంజసమైన విషయాలు తెలిపారు. అందులో ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఆధారాలు లేని వాటిపై ఊహాజనిత కథనాలు లేనిపోని ఉద్రిక్తతతలకు దారి తీస్తాయని తెలిపారు. దీనిపై అమెరికా ఇప్పటికే మాట్లాడిందని, దీనిపై విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు కొనసాగిస్తుందని రణధీర్ పేర్కొన్నారు. అమెరికా ఇచ్చిన ఆ ఇన్‌పుట్‌లను కూడా పరిశీలిస్తున్నామని రణ్ ధీర్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైన ఊహాగానాలు చేయడం.. బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం సరికాదన్నారు.
ఖలిస్తానీ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కుట్రలో భారత అధికారులు పాల్గొన్నట్లు.. అలాగే, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలో భారతీయ ఏజెంట్లు హత్య చేశారంటూ అమెరికా వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఆరోపణలు చేయడంపై భారత్ మండిపడింది.