ఇరాన్​ అధ్యక్షుడి మృతి 21న భారత్​ సంతాప దినంగా ప్రకటన

India declares 21st day of mourning for death of Iranian president

May 20, 2024 - 17:57
 0
ఇరాన్​ అధ్యక్షుడి మృతి 21న భారత్​ సంతాప దినంగా ప్రకటన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇరాన్​ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విమాన ప్రమాదంలో మృతిచెందడంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 21న భారత్​ లో సంపతాప దినం పాటించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. వినోద కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలను నిర్వహించరాదని కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్​–ఇరాన్​ మధ్య ఇటీవలే జరిగిన పలు ఒప్పందాలు, దౌత్య సంబంధాలు భారత వృద్ధికి కీలకం కానుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇబ్రహీం రైసీ అనేక విషయాల్లో భారత్​ కు వెన్నంటే నిలిచారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా కష్టకాలంలో ఆ దేశానికి పూర్తి మద్దతు, సంతాపం ప్రకటించారు. 

అమెరికా ఇరాన్​ తో వ్యాపార, వాణిజ్యాలపై పలు ఆంక్షలను విధించినా భారత్​–ఇరాన్​ మధ్య వ్యూహాత్మక బంధాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఇబ్రహీం రైసీ–నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటూ ఇరుదేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హఠాత్మపరిణామంతో భారత్​ ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది.