పిల్లల్లో దేశభక్తి విశ్వాసాన్ని పెంపొందిస్తాయి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ

Dec 26, 2024 - 13:30
 0
పిల్లల్లో దేశభక్తి విశ్వాసాన్ని పెంపొందిస్తాయి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పిల్లల్లో దేశభక్తి దేశ భవిష్యత్తును, విశ్వాసాన్ని బలపరుస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో 17 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని ప్రదానం చేశారు. 14 రాష్ర్టాలు, కేంద్రాల నుంచి ఎంపికైన 17 మంది చిన్నారులకు అవార్డులను అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ముర్మూ మాట్లాడుతూ.. వీర్​ బల్​ దివస్​ సందర్భంగా గురు గోవింద్​ సింగ్​ చిన్న కుమారుల అసమాన త్యాగాన్ని, ధైర్యాన్ని ప్రపంచం గుర్తు పెట్టుకుంటుందన్నారు. అవార్డులు అందుకున్న చిన్నారులను రాష్ట్రపతి అభినందించారు. చిన్నతనంలో వారి కృషి అసాధారణం, ఆశ్చర్యకరమైనదన్నారు. ప్రతి ఒక్కరూ అసమానమైన లక్షణాలను కలిగి ఉన్నారని, వీరి విజయాలు దేశ పౌరులందరికీ స్ఫూర్తినిస్తాయని ఆమె ఉద్ఘాటించారు.