రైలుకింద కూర్చొని 250కి.మీ. ప్రయాణం!

250 km-sitting-under-the-train.-Travel

Dec 27, 2024 - 18:56
Dec 27, 2024 - 18:58
 0
రైలుకింద కూర్చొని 250కి.మీ. ప్రయాణం!

భోపాల్: రైలు కింద నక్కి ఓ వ్యక్తి 250 కి.మీ. చేశాడు! ఇది నిజమా? అని నోరెళ్లబెట్టకండి. అక్షరాలా నిజమే! రైల్వే పోలీసుల తనిఖీల్లో గుర్తించిన వ్యక్తిని అరెస్టు చేసి నాలుగు తగిలించగా మొత్తం పరిశీలించి బయటికి గక్కాడు. కాగా ఈ ఘటన డిసెంబర్ 24న చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల విచారణ అనంతరం శుక్రవారం మీడియాకు వివరించారు. 24న జబల్ పూర్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ఉద్యోగులు సాధారణ తనిఖీలు చేశారు. ఈ అండర్ క్యారేజీ తనిఖీల్లో వ్యక్తి నక్కి ఉండడాన్ని చూసి లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది లోకో పైలెట్ అతన్ని బయటకు తీసి నాలుగు చీవాట్లు పెట్టారు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆర్పీఎఫ్ పోలీసుల విచారణలో ఇతను 250కి.మీ. పేర్కొన్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా రైలులో కూర్చొని, ఇంకా ఎక్కువగా ప్రయాణికులుంటే రైలు మీద కూర్చొని, రైలు ఇంజిన్ ముందు కూర్చొని వెళ్లడం చూశామేమో గాని, రైలు కింద ప్రయాణించడం ఈ వ్యక్తికి ఎలా సాధ్యమైందని తెలుసుకున్నారు వారు నోరెళ్లబెట్టారు. ఇంతకు ఇంతదూరం రైలుకింద కూర్చొని నిద్రించినందుకు ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కాలి. కానీ వారు రికార్డు ఇస్తారో? లేదా నాలుగు చీవాట్లు పెడతారో?!