ఫిన్లాండ్​ విద్యుత్​ కేబుల్​ కట్​

రష్యా ఓడను స్వాధీనం చేసుకున్న ఫిన్లాండ్​

Dec 27, 2024 - 18:38
 0
ఫిన్లాండ్​ విద్యుత్​ కేబుల్​ కట్​

హెల్సింకి: ఫిన్లాండ్​ కు చెందిన సముద్రగర్భంలోని విద్యుత్​ సరఫరా కేబుల్​ ను కత్తిరించారన్న ఆరోపణలపై ఆ దేశ తీర రక్షక దళాలు రష్యన్​ చమురు నౌకన్​ ను స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం ఫిన్లాండ్​, ఎస్టోనియా మధ్య సముద్రంలో ఉన్న ఈ విద్యుత్​ సరఫరా కేబుల్​ తెగిపోయింది. రష్యన్​ నౌకనే ఈ కేబుల్​ ను కట్​ చేసిందని ఫిన్నిష్​ అధికారులు శుక్రవారం మీడియాకు వివరించారు. రష్యాకు చెందిన ఈగిల్​ ఎస్​ అనే చమురు ట్యాంకర్​ తమ దేశ ప్రాదేశిక జలాల్లో అడ్డుకున్నామన్నారు. ఈ ఓడ రష్​యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి ఈజిప్ట్‌లోని పోర్ట్ సెడ్‌కు వెళుతోంది. మధ్య సముద్రగర్భలో ఉన్న విద్యుత్​ సరఫరా చేసే ఎస్ట్​ లింక్​–2 కేబుల్​ పై నుంచి వెళ్లడం వల్ల ఈ కేబుల్​ తెగిపోయిందని ఆరోపించారు. ఈఘటనపై ఓడ ప్రమేయం ఉందా? లేదా? అనే దానిపై ఫిన్నిస్​ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేబుల్​ ద్వారా 650 మెగావాట్ల విద్యుత్​ సరఫరా అవుతుంది. కేబుల్​ పొడవు 170 కి.మీ. ఇందులో 145 కి.మీ. సముద్రగర్భంలోనే ఉండడం గమనార్హం.