మాజీ ప్రధాని మృతి.. పలు దేశాల సంతాపం
Death of former Prime Minister. Many countries are mourning
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలు దేశాలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాయి, సంతాపాన్ని ప్రకటించాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇరాన్ తో సహా పలు దేశాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నాయి. ఈ దేశాధ్యక్షులు డా.మన్మోహన్ సింగ్ తో తమకున్న బంధాలు, అనుబంధాలను మననం చేసుకున్నారు. ఆయన రాజకీయ పాలన, విదేశీ నీతిపై హర్షం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆయనతో కలిసిన చిత్రాలను పోస్టు చేస్తూ మన్మోహన్ కు నివాళులర్పించారు. దేశాధ్యక్షులతోపాటు విదేశాంగ శాఖలు, రాయబార కార్యాలయాల ప్రధానాధికారులూ తమ సంతాపాన్ని ప్రకటించారు. ద్వైపాక్షిక బంధాలను మన్మోహన్ బలోపేతం చేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నిబద్ధతను కొనియాడారు.