దేశం గర్వించే ధైర్యవంతుడు ఉదమ్ సింగ్
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: భారతదేశం గర్వించే గొప్ప విప్లవకారుడు, ధైర్యవంతుడు సర్దార్ ఉదమ్ సింగ్ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి అన్నారు. ఉదమ్ సింగ్ 125వ జయంతి సందర్భంగా ఆయన దేశభక్తిని స్మరించుకొని నివాళులర్పించారు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకొని ప్రతీఒక్కరిలో ధైర్యాన్ని నింపారన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో దేశభక్తిని రగల్చారని కొనియాడారు. ఆయన పోరాటాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 1899లో జన్మించిన ఉదమ్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు. జలియన్ వాలా బాగ్ కాల్పులకు బాధ్యత వహించిన పంజాబ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మైఖేల్ ఓడ్వెర్ ను మట్టుబెట్టాడు. అనంతరం ఈ హత్యకేసులో 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఉదమ్ సింగ్ కు ఉరిశిక్ష విధించింది. నాటి ఉదమ్ సింగ్ ధైర్యసాహసాలతో బ్రిటిష్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది.