ఆగ్రా–లక్నో హైవేపై ఘోర ప్రమాదం 8మంది మృతి, 10మందికి తీవ్ర గాయాలు
A fatal accident on Agra-Lucknow highway left 8 dead and 10 seriously injured
లక్నో: యూపీలోని కన్నౌజ్ ఆగ్రా–-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. శుక్రవారం ఈ ఘోర ప్రమాదం జరిగిందని కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు. ప్రమాద వివరాలను మీడియాకు అందించారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారని తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదం సక్రవా పోలీస్ స్టేషన్ పరిధి 141 ఔరయా సరిహద్దులో మధ్యాహ్నం జరిగిందన్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న సైఫాయి మెడికల్ కాలేజీ, తిర్వాకు తరలించి చికిత్సనందిస్తున్నట్లు తెలిపారు. బస్సు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొట్టిందని తెలిపారు. స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసి పోలీసులకు సమాచారం చేరవేశారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యిందని, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.