సీఎం హౌస్ కు అంబులెన్సుతో బీజేపీ నేత
రెండు గంటల్లోనే అన్ని పరీక్షలు చేయిస్తా గోయల్ .. ప్రజా సానుభూతికి విఫలయత్నం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ ఆసుపత్రిలో రెండు గంటల్లోనే అన్ని పరీక్షలు చేయిస్తానని బీజేపీ నాయకుడు విజయ్ గోయల్ అన్నారు. సీఎం హౌస్ కు శనివారం అంబులెన్స్ ను పంపారు. ఆయనకూడా అంబులెన్స్ వెంట వచ్చారు. కాగా పోలీసులు గోయల్ చర్యను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలు చెప్పి, చెకప్ ల పేరుతో జైలుకు వెళ్లేందుకు కోర్టుకు సాకులు చెబుతున్నారన్నారు. ఎలాంటి పరీక్షలైనా తానే స్వయంగా చేయిస్తానని అన్నారు. ఒకవేళ నిజంగానే సీఎం అనారోగ్య కారణాలతో బాధపడుతుంటే నాటకాలను ఆపి తనవెంట వచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్ డ్రామాలు ఆడుతున్నారని గోయల్ మండిపడ్డారు. శనివారంతో సీఎం కేజ్రీవాల్ బెయిల్ గడువు పూర్తి కానుంది. జూన్ 2 న పోలీసుల సమక్షంలో లొంగిపోవాల్సి ఉంది. కాగా ఇటీవలే తన అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ సీఎం కేజ్రీవాల్ మరో ఏడురోజులపాటు బెయిల్ ను పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.