ఒపీనియన్, ఎగ్జిల్ పోల్?
Opinion, exile poll?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశంలో ఎన్నికల వేడి సమాప్తం కావడంతో అందరి దృష్టి ఒపీనియన్, ఎగ్జిట్ పోల్ ల మీద ఉంది. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.
ఒపీనియన్ పోల్: ఎన్నికలకు ముందు స్వచ్చందంగా కొన్ని ఏజెన్సీలు, మీడియా ఒపీనియన్ పోల్‌లను నిర్వహిస్తాయి. ఇందులో ఓటు వేసే ప్రతీ ఒక్కరిని భాగస్వాములను చేసి వారి వారి అభిప్రాయాలను సేకరిస్తాయి. కేవలం ఓటర్లే కాకుండా ప్రజాభిప్రాయం తీసుకుంటారు. అలాగే స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ ఏ వర్గం వారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని తెలుసుకుంటారు. ప్రభుత్వంపై ప్రజలకు ఏ మేరకు సంతృప్తి, అసంతృప్తి ఉందనేది గణాంకాలతో సహ సేకరిస్తారు. దీని ద్వారా ప్రజానాడీ పూర్తిగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఎన్నికలకు ముందు నిర్వహించేదే ఓపీనియన్ పోల్ అన్నమాట.
ఎగ్జిట్ పోల్: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల ద్వారా సమాచారం సేకరిస్తారు. ఎవరికి ఓటు వేశారు. ఎందుకు వేశారు లాంటి ప్రశ్నలను మీడియా, స్వచ్ఛంద సంస్థలు, పలువురు వ్యక్తులు ఈ ఎగ్జిట్ పోల్ లు నిర్వహిస్తుంటారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 30 నుంచి 35వేల మంది వరకు అభిప్రాయాలను సేకరిస్తారు. దీని ద్వారా గెలుపుపై పూర్తి అంచనాకు వస్తారు. అంటే ఎగ్జిట్ పోల్ లో వచ్చిన సమాచారం 70 నుంచి 100 శాతం వరకు ఖచ్చితత్వంతో కూడుకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుంటారు. ఓటర్ల ద్వారా పూర్తి సమాచార సేకరణే ఎగ్జిట్ పోల్ గా పేర్కొంటారు.