కాంగ్రెస్​ డబుల్​ గేమ్

మాదిగలకు మొండి‘చేయి’ మూడు రిజర్వ్​డ్​లో ఒక్కటీ ఇవ్వలే..  రెండు మాలలకు, ఒకటి బైండ్లకు..  మంత్రి వర్గంలోనూ అగ్రకులానిదే ఆధిపత్యం సామాజిక న్యాయానికి మంగళం  రిజర్వేషన్లపై మాత్రం గప్పాలు..  ఓట్ల కోసం అసత్య ప్రచారంలో కాంగ్రెస్ బిజీబిజీ 

Apr 30, 2024 - 17:15
 0
కాంగ్రెస్​ డబుల్​ గేమ్

నా తెలంగాణ, హైదరాబాద్: 


     రిజర్వేషన్లపై బీజేపీని నిందిస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలనే దుర్భుద్ధితో తన తప్పును మరిచిపోతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ.. అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న కాంగ్రెస్​ పార్లమెంట్ ​అభ్యర్థుల ఎంపిక విధానంలో మాత్రం సామాజిక న్యాయం, రిజర్వేషన్​ అనే అంశాలకు ‘నిజమైన’ విధానానికి తూట్లు పొడిచింది. రాష్ర్టంలోని 17 ఎంపీ స్థానాల్లో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్​డ్​కాగా.. హైదరాబాద్ ​స్థానం మినహాయిస్తే 11 సీట్లు జనరల్​కు రిజర్వ్​అయ్యాయి. ఎస్సీ రిజర్వ్​డ్​ విషయంలోనూ కాంగ్రెస్​ మాల సామాజిక వర్గానికి వంత పాడుతూ.. మెజార్టీ సంఖ్యాకులైన మాదిగలకు మొండి చేయి చూపింది. నిజానికి ఎస్సీ సామాజిక వర్గంలో 80 శాతం మాదిగలే ఉంటారు. అంత సంఖ్యలో ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.  

మాదిగలకు మొండి‘చేయి’..

రాష్ర్టంలో మూడు స్థానాలు ఎస్సీలకు రిజర్వు ​అయ్యాయి. వీటిలో నాగర్​కర్నూల్, వరంగల్, పెద్దపల్లిలు ఉన్నాయి. నాగర్​కర్నూల్, పెద్దపల్లి ​నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లురవి, గడ్డం వంశీ, వరంగల్​ నుంచి మాదిగ ఉపకులమైన బైండ్ల నుంచి కడియం కావ్యలకు పార్టీ టికెట్లు కట్టబెట్టింది. కానీ, మాదిగ సామాజిక వర్గానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహావేశాలు చెలరేగాయి. మంద కృష్ణమాదిగ రంగంలోకి దిగి కాంగ్రెస్​పై, కడియం శ్రీహరిలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్​కు ఓటు వేయొద్దంటూ మాదిగలకు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉన్నందున కమలం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 

మాలలకు డిప్యూటీ సీఎం, స్పీకర్.. 

    రాష్ట్రంలో 20 శాతమున్న మాలలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ​అగ్ర నాయకత్వం పెద్దపీట వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ ​గడ్డం ప్రసాద్ లు మాల సామానిక వర్గానికి చెందిన నేతలు. ప్రస్తుతం పార్లమెంట్​కు పోటీ పడుతున్న నాగర్​కర్నూల్, పెద్దపల్లి స్థానాల్లో కూడా గడ్డం వంశీ, మల్లురవిలు కూడా అదే సామాజిక వర్గం వారే. ప్రభుత్వ ముఖ్య స్థానాల్లో మాలలకే అవకాశం ఇచ్చారని ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్న వారికి తాజా సీట్ల కేటాయింపు మరింత కోపాన్ని పెంచుతోంది. కాంగ్రెస్​పార్టీ కావాలనే తమను అణిచివేస్తున్నారనే భావనలో మాదిగ సామాజిక వర్గం భావిస్తోంది.  

రెడ్లకే పెద్దపీట.. 

11 పార్లమెంట్​సీట్లలో కాంగ్రెస్​మెజార్టీ స్థానాల్లో రెడ్డి నేతలకే అవకాశం ఇచ్చింది. నల్గొండ రఘువీర్​రెడ్డి,  ఖమ్మం రఘురాంరెడ్డి, భువనగిరి చామల కిరణ్​కుమార్​రెడ్డి, చేవెళ్ల రంజిత్​రెడ్డి, మల్కాజిగిరి పట్నం సునీతా మహేందర్​రెడ్డి, మహబూబ్​నగర్ వంశీచంద్​రెడ్డి,  నిజామాబాద్​ జీవన్​రెడ్డిలు బరిలో నిలిచారు. కరీంనగర్​ నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెలిచాల రాజేందర్​రావులకు అవకాశం కల్పించారు. 11 స్థానాలకు ఎనిమిది మందికి అగ్రకులానికే కాంగ్రెస్​పెద్దపీట వేసింది. రెడ్లకు కేటాయించిన శాతం ఏకంగా 64 శాతంగా ఉందంటే.. కాంగ్రెస్​లో అగ్ర కుల ఆధిపత్యం ఏమేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మెదక్​ నుంచి నీలం మధు, సికింద్రాబాద్​ నుంచి దానం నాగేందర్ లు మాత్రమే బీసీ కార్డుతో బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు స్థానాల్లో కూడా కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనేందుకు అపసోపాలు పడుతోంది. ఈ రెండు స్థానల్లోనూ ఓడితే పార్లమెంట్​లో తెలంగాణ బలహీనవర్గాల నుంచి ప్రాతినిథ్యం శూన్యమవుతుంది. జహీరాబాద్​నుంచి పోటీపడుతున్న సురేష్​షెట్కర్ ​ఇక్క డ బీసీగా చెలామణి అవుతున్నారు. కానీ, షెట్కర్ ​లింగాయత్ సామాజిక వర్గం పొరుగునే ఉన్నకర్నాటకలో ఓసీ కేటాగిరిలో ఉంది. తెలంగాణలో లింగాయత్​లు ఒక్క శాతానికి లోపేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బీసీలను కాంగ్రెస్ పార్టీ ​పక్కా ప్రణాళికతోనే అణగదొక్కారు. పోనీ మంత్రి వర్గంలోనైనా సామాజిక న్యాయం పాటించారా అంటే అదీ లేదు. ఉత్తమ్​రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటిలు రెడ్డి కాగా.. వెలమ నుంచి జూపల్లి, తుమ్మలకు అవకాశం కల్పించడం ద్వారా సామాజిక న్యాయంపై కాంగ్రెస్​కు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది.

రిజర్వేషన్​పై గప్పాలు.. 

    బీజేపీని అబాసుపాలు చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్​అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్​కు సెల్ఫ్​గోల్​వేసుకున్నట్టయింది. రాష్ర్టంలో కాంగ్రెస్​ప్రభుత్వం మంత్రి పదవుల్లో, పార్లమెంట్​ సీట్ల కేటాయింపు విషయంలో అవలంబించిన విధానం రిజర్వేషన్​ను ఉల్లఘించినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను తెచ్చింది కూడా వారసత్వ పార్టీయే. ముస్లింలకు మతపరమైన ప్రత్యేక రిజర్వేషన్​ను తీసుకురావడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తాజాగా కర్నాటకలో ముస్లింలను బీసీ కేటగిరిలోకి తీసుకొచ్చారు. గతంలో ఉన్న కోటాను ముస్లింలతో పాటు బీసీలు పంచుకోవాల్సి వస్తోంది. దీని ద్వారా బీసీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది. డబుల్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్.. బీజేపీని నిందించే క్రమంలో తనకు తానే ఇరుక్కుపోయే దుస్థితికి దిగజారింది.