ఎంపీ ఎన్నికల్లో ఎన్​ ఆర్ఐ​ ఓటర్ల అనాసక్తి!

Apathy-of-NRI-voters-in-MP-elections

Dec 29, 2024 - 16:01
Dec 29, 2024 - 18:00
 0
ఎంపీ ఎన్నికల్లో ఎన్​ ఆర్ఐ​ ఓటర్ల అనాసక్తి!

1,19,374మంది ఓటర్లలో వేసింది 2,958మంది మాత్రమే!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: 2024లో జరిగిన లోక్​ సభ (ఎంపీ) ఎన్నికల్లో ఎన్​ ఆర్​ ఐ ఓటర్లు ఓటువేసేందుకు మొగ్గుచూపలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ర్టలో 5,097 ఎన్నారై ఓటర్లకు గాను కేవలం 17 మంది మాత్రమే ఓటు వేశారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 1,19,374 లక్షల మంది ఎన్​ ఆర్​ ఐ ఓటర్లు ఉండగా, ఇందులో 2, 958 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కేరళలో 2670మంది ఎన్​ ఆర్​ ఐలు ఓటు వేశారు. 

గుజరాత్​ లో 885 మంది ఓటు వేసేందుకు వచ్చినా చాలామంది ఓటు వేయలేదు. మహారాష్ర్టలో 5,097 మందిలో 17 మంది మాత్రమే ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్​​ లో 7,927 మంది ఉండగా 195మంది, అసోంలో 19మంది ఓటర్లలో ఏ ఒక్కరూ ఓటు వేయలేదు. బిహార్​ లో 89 మంది ఉండగా ఇక్కడ ఏ ఒక్కరూ ఓటు వేయకపోవడం విశేషం. అలాగే గోవాలో 84 మంది ఎన్​ ఆర్​ ఐ ఓటర్లుండగా ఇక్కడ ఒక్కరూ ఓటు వేయలేదు. 16వ లోక్​ సభ అర్హత కలిగిన ఎన్​ ఆర్​ ఐలకు ఓటు హక్కు కల్పించే బిల్లును 2018లో ఆమోదించింది. అయితే విదేశీ ఓటర్లకు దేశ ఓటింగ్​ పై మక్కువ తగ్గేందుకు వివిధ కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోస్టల్​ బ్యాలెట్​ ఓటింగ్​, ఆన్​ లైన్​ ఓటింగ్​ డిమాండ్లు ఉన్నాయి. పైగా విదేశాల నుంచి భారత్​ కు వచ్చి ఓటు వేయాలంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని విదేశాల్లోని ఓటర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్​ లో ఎన్​ ఆర్​ ఐ ఓటింగ్​ భారీగా తగ్గుతుంది.