అవాస్తవాల చరిత్ర కాంగ్రెస్​ ది

Congress is a history of lies

Dec 29, 2024 - 16:24
 0
అవాస్తవాల చరిత్ర కాంగ్రెస్​ ది

అగ్గిమీద గుగ్గిలమైన కేంద్రమంత్రి హర్దీప్​ సింగ్​ పూరి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మన్మోహన్​ సింగ్​ అంత్యక్రియలు, స్మారక, సమాధి స్థలం కేటాయింపుపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్​ పార్టీ, గాంధీ కుటుంబ సభ్యులు పీవీ నర్సింహారావు పార్థివదేహాన్ని సైతం కాంగ్రెస్​ కార్యాలయంలో ఎందుకు అనుమతించలేదని కేంద్రమంత్రి హర్దిప్​ సింగ్​ పూరి నిలదీశారు. వీరి చరిత్ర అంతా అవాస్తవాలతో కూడుకున్నదన్నారు. ఎంతకు ఈ వివాదంపై కాంగ్రెస్​ విమర్శలు చేస్తుండడంతో హర్దీప్​ సింగ్​ పూరి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్​, గాంధీ కుటుంబంపై పదునైన విమర్శలు గుప్పించారు.

మన్మోహన్​ సింగ్​ అస్థికలు నిమజ్జనం చేస్తే కూడా వెళ్లారా? అని నిలదీశారు. నిగంబోధ్​ లో 21 గన్​ సెల్యూట్​ ను కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు. రాష్ర్టపతి, ప్రధాని, కేంద్రమంత్రులు పాల్గొన్నది మీకు కనిపించలేదా? అని నిలదీశారు. క్యాబినెట్​ సమావేశం నివాళులు, సమాధి స్థల కేటాయింపుపై ఖర్గేకు వివరాలు అందించామన్నారు. అయినా మీనమేషాలు లెక్కించే యత్నాలకు కాంగ్రెస్​ తెరతీసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి కూడా అధికారం చేపట్టడంతో కాంగ్రెస్​ కు వెర్రెక్కిపోతుందని పదునైన విమర్శలు సంధించారు.

అందుకే ప్రతీ అంశంపై విమర్శలు, ఆరోపణలకు దిగుతుందన్నారు. అసలు పీవీని గౌరవించింది ఎవరని నిలదీశారు. ప్రధాని మోదీ స్మారక చిహ్నాన్ని, భారతరత్నను అందించే నిర్ణయం తీసుకుందన్నారు. కనీసం ఆయన పార్థివ దేహాన్ని కూడా కార్యాలయంలోకి అనుమతించకపోవడం మీ కుటీల నీతికి నిదర్శనమని కేంద్రమంత్రి హర్దీప్​ సింగ్​ పూరి కాంగ్రెస్​ పార్టీ, సోనియా కుటుంబంపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు.