హ్యాట్రిక్ నామినేషన్ మూడోసారి విజయం ఖాయమే
వారణాసి నుంచి మోదీ మూడోసారి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రముఖుల హాజరు గంగాహారతి, కాలభైరవుడి దర్శనం
వారణాసి: ప్రధానమంత్రి నామినేషన్ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దశాశ్వమేధ ఘాట్‌కు చేరుకున్నారు. వేదపండితుల సమక్షంలో షోడశోపచార పద్ధతిలో గంగపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం 20 నిమిషాలపాటు కొనసాగింది. అనంతరం గంగా హారతి చేపట్టారు. పండితులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దశాశ్వమేధ ఘాట్ నుంచి క్రూయిజ్ ఎక్కి నమో ఘాట్ చేరుకున్నారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాశీలోని కొత్వాల్ అని పిలిచే కాలభైరవ ఆలయానికి చేరుకున్నారు. దర్శనం, ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారణాసి కలెక్టరేట్ కు వెళ్లి నామినేషన్ వేశారు. వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్ వేయడం ఇది మూడోసారి.
నామినేషన్ కార్యక్రమానికి సీఎంలు..
ప్రధాని నామినేషన్ కార్యక్రమానికి పలు రాష్ర్టాల సీఎంలు హాజరయ్యారు. యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్ నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత బిశ్వ శర్మ, నయాబ్ సైనీ, ప్రమోద్ షావంత్, ప్రేమ్ సింగ్ తమంగ్, మాణిక్ సాహాలు ఉన్నారు.
కేంద్రమంత్రులు..
కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన ధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీయే పక్షాల అధ్యక్షులు తదితరులు పెద్ద యెత్తున హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి 2014లో 5,84,022 56.4 శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో 6,74,664 లక్షలు 63.6 లక్షల ఓట్లు 63.6 శాతం ఓట్లతో విజయం సాధించారు. వారణాసిలో మొత్తం ఓటర్ల సంఖ్య 19.62 లక్షలు. 10.65 లక్షల పురుషులు, 8.97 లక్షల మహిళా ఓటర్లున్నారు.
ప్రధానమంత్రి నామినేషన్ లో మోదీతోపాటు కలెక్టరేట్ లోని కేవలం ముగ్గురినే అనుమతించారు. అందులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు కాగా, రెండవ వారు గణేశ్వర్ శాస్ర్తి ద్రావిడ అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఈయనే కీలక వ్యక్తిగా పేర్కొంటారు. బైద్యనాథ్ పటేల్ లు కార్యాలయంలో మోదీతోపాటు ఉన్నారు. మిగతా వారంతా కలెక్టరేట్ ఆవరణ బయటే వేచి ఉన్నారు.
మోదీ శపథం..
రాజ్యాంగం పట్ల నిజమైన విధేయతను కలిగి ఉంటానని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు. సత్య నిష్ట కోసమే ఎల్లవేళలా పాటుపడతానన్నారు. వారణాసి, దేశ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని తన విధులను నిర్వహిస్తానని ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా కలెక్టరేట్ లో ప్రతిజ్ఞ చేశారు.