ఆయిల్​ మిల్​, పిండిగిర్ని ప్రారంభం

Start of Oil Mill, Pindigirni

Aug 23, 2024 - 18:29
 0
ఆయిల్​ మిల్​, పిండిగిర్ని ప్రారంభం

నా తెలంగాణ, ఆదిలాబాద్​: సిరికొండ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఇందిర మహిళా శక్తి పథకం కింద పిండి గిర్ని, ఆయిల్ మిల్లును జిల్లా కలెక్టర్​ రాజర్షి షా శుక్రవారం ప్రారంభించారు. వీటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ గిరిజన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. 

సిరికొండ తిమ్మాపూర్​ గ్రామంలో కలెక్టర్​ రాజర్షికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. తిమ్మాపూర్​ లో కొటాక్ లక్ష్మీ బ్యాంక్​ ద్వారా రూ. 1,49,000 పిండిగిర్ని, ఆయిల్​ మిల్​ ను ఏర్పాటు చేశారు. 

ఇందిరా మహిళా శక్తి పథకం కింద మేలుజాతి గేదెలు, బర్రెలు తీసుకొని పాల ఉత్పత్తుల ద్వారా లబ్ధి పొందొచ్చని కలెక్టర్​ సూచించారు. ఇందుకోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పీఎంజీవై కింద రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఋణం పొందే అవకాశం ఉందన్నారు. ఋణాలు సక్రమంగా చెల్లిస్తే మరింత ఋణం వచ్చేందుకు వీలుందన్నారు.
మహిళా శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన పప్పుమిల్​ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తొలివిడత నిధులు రెండు, మూడు రోజుల్లో అందిస్తామన్నారు.

ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైనేను నిర్వహించి పరిశుభ్రత పాటించాలన్నారు. రోడ్లు, ఇళ్ల పరిసరాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామస్థులు పలు సమస్యలను కలెక్టర్​ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో  డీఆర్డీవో సాయన్న, ఎమ్మార్వో ఉపేంద్ర, ఎంపిడిఓ రమేశ్, ఏపీఎం, ఏపీవో, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.