26వ నూతన నేవీ చీఫ్​ గా అడ్మిరల్​ దినేష్​ కుమార్​ త్రిపాఠీ బాధ్యతల స్వీకరణ

26వ నేవీ చీఫ్​ గా అడ్మిరల్​ దినేష్​ కుమార్​ త్రిపాఠీ మంగళవారం నూతన బాధ్యతలను స్వీకరించారు.

Apr 30, 2024 - 20:23
Apr 30, 2024 - 20:24
 0
26వ నూతన నేవీ చీఫ్​ గా అడ్మిరల్​ దినేష్​ కుమార్​ త్రిపాఠీ బాధ్యతల స్వీకరణ

నా తెలంగాణ, న్యూఢిల్లీ: 26వ నేవీ చీఫ్​ గా అడ్మిరల్​ దినేష్​ కుమార్​ త్రిపాఠీ మంగళవారం నూతన బాధ్యతలను స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్​ బ్లాక్​ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన నేవీ చీఫ్​ గా బాధ్యతలు చేపట్టారు. అయితే బాధ్యతలను చేపట్టే ముందు త్రిపాఠీ తన తల్లి రజనీ త్రిపాఠీ కాళ్లకు దండం పెట్టారు. ఈ సందర్భంగా తల్లి అతని వీపుతట్టి ప్రోత్సహిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 

బాధ్యతలను స్వీకరించిన అనంతరం త్రిపాఠీ మాట్లాడారు. కొన్నేళ్లుగా సముద్రంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు నౌకాదళం పోరాటాలకు సిద్ధంగా ఉందని అన్నారు. నమ్మకమైన భవిష్యత్​ కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఆవిర్భవిస్తున్న నూతన సవాళ్లకు ప్రతిస్పందించేందుకు నిరోధించేందుకు నావికాదళం ఎళ్లవేళలా సిద్ధంగా ఉందని త్రిపాఠీ తెలిపారు. సముద్రంలో శాంతిని కాపాడేందుకు తీరాన్ని పటిష్ట పరిచేందుకు తనవంతు కృషి చేస్తానని నూతన నేవీ చీఫ్​ దినేష్​ కుమార్​ త్రిపాఠీ తెలిపారు.