నాలుగో దశలో 476మంది కోటీశ్వరులు 360మందిపై క్రిమినల్ కేసులు
నాలుగో దశ ఎన్నికలు మే 13 (సోమవారం) జరగనున్నాయి. 1717 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1710 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించి నివేదికను శనివారం విడుదల చేసింది.
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: నాలుగో దశ ఎన్నికలు మే 13 (సోమవారం) జరగనున్నాయి. 1717 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1710 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించి నివేదికను శనివారం విడుదల చేసింది. వీరిలో 476 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. 360 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.
21 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. 274 మంది 16 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. 11 మంది అభ్యర్థులపై హత్య కేసులుండగా, 30మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇక మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి కేసుల్లో 50 మంది అభ్యర్థులుండడం గమనార్హం. ఐదుగురిపై అత్యాచారం కేసులు నమోదు కాగా, 44 మందిపై ఉద్వేగ పూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.
ఎంఐఎంకు –3, శివసేన –2, కాంగ్రెస్ –35, టీడీపీ –9, బీజేడీ–2, ఆర్ జేడీ–4, శివసేన యూబీటీ –2, వైఎస్సార్సీపీ–12, టీఎంసీ –3, ఎస్పీ ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదైన వారిలో ఉన్నారు.
అత్యధిక ఆస్తులున్న అభ్యర్థిగా చంద్రశేఖర్ పేమసాని ఉన్నారు. ఈయన గుంటూరు టీడీపీ అభ్యర్థి మొత్తం ఆస్తుల విలువ రూ.5705 కోట్లు. ఈ విషయంలో బీజేపీకి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణలోని చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేస్తున్న రెడ్డి తన అఫిడవిట్‌లో రూ.4568 కోట్ల సంపద ఉన్నట్లు ప్రకటించారు. మూడో ధనిక అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ఉన్నారు. ప్రభాకర్ ఆస్తుల విలువ రూ.716 కోట్లు. 24 మంది ఆస్తులు లేనట్లుగా ప్రకటించారు.
38 శాతం మంది (644) అభ్యర్థులు ఐదు నుంచి 12వ తరగతి మధ్య చదివిన వారున్నారు. 55 శాతం మంది (944) గ్రాడ్యుయేట్ లు, 66 మంది డిప్లోమా, 56 మంది నిరక్ష్యరాస్యులున్నారు.
ఇక వయస్సుల వారీగా గణాంకాలను పరిశీలిస్తే 38 శాతం (642) 25 నుంచి 40యేళ్లలోపు వారు. 49 శాతం (842) మంది 41 నుంచి 60 వయస్సుల వారు, 13 శాతం (226)మంది అభ్యర్థులు 61 నుంచి 80 యేళ్ల మధ్య వయస్సు గలవారున్నారు. 10 శాతం మంది మహిళలు నాలుగోదశలో బరిలో ఉన్నారు.